Andhra Pradesh: పింఛన్ ఇవ్వకపోతే పెట్రోలు పోసి తగలెట్టేస్తాం!.. అనంతపురం జిల్లాలో పింఛనుదారుల బెదిరింపులు

  • పింఛన్ కోసం పంచాయతీ కార్యదర్శితో వాగ్వివాదం
  • వచ్చే నెల నుంచి ఇవ్వకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తామని హెచ్చరిక
  • కొడవలితో కార్యాలయంలోకి మహిళ

అనంతపురం జిల్లా కూడేరు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన కొందరు వ్యక్తులు తమకు ఈ నెల పింఛన్ ఎందుకు ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణను నిలదీశారు. ఈ నెల ఇవ్వడానికి లేదని, వచ్చే నెల నుంచి ఇస్తామని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వారు వచ్చే నెల కనుక పింఛన్ రాకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తామని బెదిరించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని పెన్నోబులేశు, శివమ్మతోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శివమ్మ కార్యాలయంలోకి వెళ్లిన సమయంలో ఆమె చేతిలో కొడవలి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శివమ్మ కొడవలితో అక్కడికి ఎందుకు వెళ్లిందన్న విషయంపై ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కార్యదర్శి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Andhra Pradesh
Anantapur District
pension
petrol
  • Loading...

More Telugu News