Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని.. త్వరలో ఉత్తర్వులు?

  • సహానీని తమకు కేటాయించాలని కేంద్రానికి ఏపీ లేఖ 
  • కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న సహానీ
  • ఆమెను బదిలీ చేసేందుకు కేంద్రం సుముఖత!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని నియమితులు కానున్నారని తెలుస్తోంది. సహాని ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. సహానీని తమ రాష్ట్రానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖలో కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో సహానీ రాష్ట్రానికి బదిలీ కానున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కేంద్రం దీనిపై ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నట్టు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Andhra Pradesh
New CS Neelam Sahani ?
  • Loading...

More Telugu News