Andhra Pradesh: ఈ విద్యా సంవత్సరం నుంచే ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు: సీఎం జగన్ ప్రకటన
- విద్యార్థుల హాస్టల్ ఖర్చులకోసం ఏడాదికి రూ.20వేలు
- గత ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపణ
- చదువు ఆపేసిన వారు మళ్లీ చదువు ప్రారంభించండన్న సీఎం
ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీరింగ్ తదితర వృత్తి విద్యాకోర్సులను చదువుతున్న పేద విద్యార్థులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం జగన్ అన్నారు. ఈ విద్యా సంవత్సరంనుంచే వందశాతం ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తామన్నారు. విద్యార్థుల హాస్టల్ ఖర్చులకోసం ప్రతీ సంవత్సరం 20వేల రూపాయలు అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కింద ఇచ్చిన మొత్తం అరకొరగా ఉండేదన్నారు. చాలీచాలని ఫీజుల కారణంగా కొంతమంది నిరుపేద విద్యార్థులు చదువును మధ్యలోనే మానేశారని పేర్కొన్నారు. వారు తిరిగి తమ చదువులను కొనసాగించాలని జగన్ పిలుపు నిచ్చారు.