Shkib Al Hasan: ఐసీసీ నిషేధంతో క్రికెట్ ను వదిలి సాకర్ ఆడుకుంటున్న షకీబల్

  • రెండేళ్ల నిషేధానికి గురైన షకీబల్
  • ఫుటీ హ్యాగ్స్ జట్టు తరఫున ఫుట్ బాల్ ఆడిన షకీబల్
  • కొరియన్ ఎక్స్ ప్యాట్ జట్టుపై ఫుటీహ్యాగ్స్ విజయం

గత ఏడాది బుకీ తనను సంప్రదించిన విషయాన్ని ఐసీసీకి తెలపకపోవడంతో రెండేళ్లపాటు నిషేధానికి గురైన బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబల్ హసన్ తాజాగా ఫుట్ బాల్ వైపు తన దృష్టిని మరల్చాడు. ఫుటీ హ్యాగ్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ మ్యాచ్ లలో పాల్గొంటున్నాడు.

ఇటీవల ఈ జట్టు కొరియాకు చెందిన ఎక్స్ ప్యాట్ జట్టుతో ఆడిన మ్యాచ్ లో 3-2 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో ఫుటీ హ్యాగ్స్ జట్టు తన ఫేస్ బుక్ మాధ్యమంగా వివరాలను పోస్ట్ చేసింది. ‘ఆర్మీ స్టేడియంలో కొరియన్ ఎక్స్ ప్యాట్ జట్టుతో ఓ పూర్తిస్థాయి మ్యాచ్ ఆడాము. మా జట్టు 3-2 తేడాతో విజయం సాధించింది. షకీబల్ జట్టులోకి రావడం సంతోషంగా ఉంది’ అని పేర్కొంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News