Whatsapp: విమర్శల పాలవుతున్న వాట్సాప్ కొత్త ఫీచర్!

  • ఫింగర్ ప్రింట్ ఫీచర్ ను తీసుకువచ్చిన వాట్సాప్
  • వ్యక్తిగత భద్రత లక్ష్యంగా సరికొత్త అప్ డేట్
  • బ్యాటరీ చార్జింగ్ తగ్గిపోతోందంటూ యూజర్ల ఆరోపణ

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల యూజర్ల భద్రత కోసం కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. వ్యక్తిగత భద్రతకు పెద్దపీట వేస్తూ ఫింగర్ ప్రింట్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. అయితే, ఈ ఫీచర్ పట్ల వినియోగదారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ ఫీచర్ కారణంగా ఫోన్ లో బ్యాటరీ త్వరగా డౌన్ అవుతోందని అభిప్రాయపడుతున్నారు. ఫింగర్ ప్రింట్ అప్ డేట్ కారణంగా ఎక్కువగా షియోమీ, శాంసంగ్, వన్ ప్లస్ ఫోన్లలోని బ్యాటరీల చార్జింగ్ విపరీతంగా తగ్గిపోతున్నట్టు యూజర్లు చెబుతున్నారు.

ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఇప్పటికే ఉపయోగిస్తున్న వాట్సాప్ ను తొలగించి, ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ సరికొత్త వెర్షన్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని కొందరు వినియోగదారులు సూచిస్తున్నారు. మొత్తమ్మీద ఎంతో హిట్టవుతుందనుకున్న కొత్త ఫీచర్ పై వాట్సాప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!

  • Error fetching data: Network response was not ok

More Telugu News