Pawan kalyan: లీడర్లకు నా అభ్యర్థన.. మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి!: పవన్ కల్యాణ్

  • మీ అభిప్రాయాలు చివరకు విధానాలుగా మారతాయి
  • అవి కొన్ని తరాలపై ప్రభావం చూపుతాయి
  • విద్యా విధానంపై వైసీపీ ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతూ పవన్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధన ప్రవేశ పెట్టడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. ప్రతిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ తాజాగా ఓ ట్వీట్ చేశారు.

  ‘నేతలు, విద్యావంతులకు నేను విన్నపం చేస్తున్నా.. మీ అభిప్రాయాలు చివరకు విధానాలుగా రూపాంతరం చెందుతాయి. అవి కొన్ని తరాలపై ప్రభావం చూపుతాయి. అందుకే, ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించమని వేడుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

Pawan kalyan
Janasena
suggestion to leaders and Scholars
Think Twice before speak
  • Loading...

More Telugu News