Sanjay Raut: ఆసుపత్రిలో చేరిన శివసేన నేత సంజయ్ రౌత్

  • ఛాతీనొప్పితో బాధపడుతున్న రౌత్
  • చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన నేత
  • వైద్యుల సలహా మేరకు అడ్మిట్

శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ ఆసుపత్రిలో చేరారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న ఆయనకు ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొన్నిరోజులుగా రౌత్ ఛాతీనొప్పితో బాధపడుతున్నారని, చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లగా ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు రౌత్ సోదరుడు సునీల్ తెలిపారు. తన సోదరుడు రేపు డిశ్చార్జ్ అవుతాడని సునీల్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో రౌత్ ఆసుపత్రిలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Sanjay Raut
Shivsena
Mumbai
Maharashtra
  • Loading...

More Telugu News