Alibaba Online Sales: ‘సింగిల్స్ డే’ షాపింగ్ సందర్భంగా.. అలీబాబాలో ‘ఒక్క గంట'లో 12 బిలియన్ డాలర్ల అమ్మకాలు!
- చైనా ఆన్ లైన్ విక్రయ సంస్థ అలీబాబా రికార్డు అమ్మకాలు
- ఈ రోజుకు 11/11 డబుల్ ఎలెవన్ గా పేరు
- ఈ షాపింగ్ ఒంటరివాళ్లకు ప్రత్యేకం
గంటలోనే 12 బిలియన్ డాలర్ల( 84 బిలియన్ యువాన్లు) విలువైన అమ్మకాలు నమోదు చేసి, చైనా ఆన్ లైన్ విక్రయ సంస్థ అలీబాబా.కామ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘సింగిల్స్ డే’ షాపింగ్ బొనాంజా ప్రకటించిన అలీబాబా హోల్డింగ్స్ కంపెనీ ఆన్ లైన్ అమ్మకాలు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి.
ఈ మేరకు వివరాలను కంపెనీ ఛైర్మన్ డేనియల్ జాంగ్ వెల్లడించారు. 2009 నుంచి ‘సింగిల్స్ డే’ నిర్వహిస్తుమన్నారు. ‘సింగిల్స్ డే’ షాపింగ్ ఫెస్టివల్ ప్రత్యేకత ఏమిటంటే, ఒంటరి వారు ఇందులో కొనుగోళ్లు చేస్తూ.. వాటిని తమకుతామే బహుమతి తీసుకుంటారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇది అతిపెద్ద ఆన్ లైన్ కొనుగోళ్ల ఈవెంట్ గా పేరు పొందింది. అమెరికాలో నిర్వహించే ఆన్ లైన్ షాపింగ్ ఉత్సవాలు అకిన్ టూ బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే వంటి కార్యక్రమాల రీతిలో చైనాలో కూడా వీటిని నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజు తేదీ 11, నెల 11 కాబట్టి ఈ అమ్మకాలను డబుల్ ఎలెవన్ గా కూడా పిలుస్తున్నారు.