Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై జగన్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై జనసైనికులు స్పందించవద్దు: నాదెండ్ల మనోహర్

  • పవన్ పోరాటాన్ని పక్కదోవ పట్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు
  • వ్యక్తిగత విమర్శలు బాధాకరం
  • ప్రజాక్షేమం కోసం భరిద్దామని పవన్ చెప్పారు

విజయవాడలో జరిగిన అబ్దుల్ కలాం విద్యా పురస్కారాల కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. ముగ్గురు భార్యలున్న పవన్ కల్యాణ్ తన ఐదుగురు పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారని విమర్శించారు.

ఈ నేపథ్యంలో, జగన్ వ్యాఖ్యలపై జనసైనికులు సంయమనం పాటించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విన్నవించారు. పవన్ పై జగన్ చేసిన వ్యక్తిగత ఆరోపణలపై ఎవరూ స్పందించవద్దని... భవన నిర్మాణ కార్మికులపై మన అధినేత చేస్తున్న పోరాటాన్ని పక్కదోవ పట్టించడానికే ఇలాంటి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చేసినట్టు భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాలసీల గురించి పవన్ మాట్లాడుతుంటే.... ముఖ్యమంత్రి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని... ఇది బాధాకరమని అన్నారు. వ్యక్తిగత వ్యాఖ్యలు బాధాకరమైనప్పటికీ... ప్రజాక్షేమం కోసం మనం భరిద్దామని పవన్ కల్యాణ్ చెప్పారని తెలిపారు. ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశంలో పవర్ కల్యాణ్ అన్నింటికీ బదులిస్తారని చెప్పారు.

Pawan Kalyan
Nadendla Manohar
YSRCP
Janasena
  • Loading...

More Telugu News