KCR: కేసీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయం: బీజేపీ ఎంపీ అరవింద్

  • అన్ని విషయాలను కేంద్రం గమనిస్తోంది
  • ఆర్టీసీ భూములను అమ్ముకునేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారు
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్ వైఖరే కారణం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని తెలిపారు. ఆర్టీసీ భూములను అమ్ముకునేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్ అహంకారపూరిత వైఖరే కారణమని చెప్పారు. కేసీఆర్ ను కోర్టుకు లాగాలని అన్నారు. ఓటమి భయంతోనే మున్సిపల్ ఎన్నికలను కేసీఆర్ నిర్వహించడం లేదని చెప్పారు.

KCR
TRS
D Aravind
BJP
  • Loading...

More Telugu News