Sandeep: కాసేపట్లో పెళ్లనగా వరుడి ఆత్మహత్య... కేసులో కొత్త ట్విస్ట్!

  • నిన్న కొంపల్లిలో సందీప్ ఆత్మహత్య
  • పిన్ని, బాబాయ్ లే కారణమంటున్న సందీప్ తండ్రి
  • లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామన్న పోలీసులు

హైదరాబాద్, పేట్ బహీర్ బాద్ సమీపంలో మరికొన్ని గంటల్లో వివాహమనగా, వరుడు సందీప్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపగా, అది ఆత్మహత్య కాదని, హత్యేనని వరుడి తండ్రి నక్కెర్తి శ్రీనివాస్ చారి ఆరోపిస్తున్నారు. వివాహానికి సందీప్ ఇష్టపడిన తరువాతే పెళ్లిని నిశ్చయించామని వెల్లడించిన ఆయన, పెళ్లి ముందు ఫోటోషూట్ కు వెళ్లి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు.

తాతయ్య ఆస్తిని ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో బాబాయ్, పిన్నమ్మలు కలిసి సందీప్ ను హత్య చేసి వుంటారని భావిస్తున్నట్టు చెప్పారు. తన తొలి భార్య, సందీప్ తల్లి మరణించిన తరువాత, వారు తనను దూరంగా ఉంచారని ఆరోపించారు. కాగా, నిన్న కొంపల్లిలోని టీ-జంక్షన్ లో ఉన్న శ్రీ కన్వెన్షన్ మ్యారేజ్ హాల్ లో సందీప్ వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరిగిన వేళ, అతను అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసును లోతుగా దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Sandeep
Marriage
Sucide
Twist
  • Loading...

More Telugu News