Yanamala: టీడీపీ హయాంలో ప్రజా ఆస్తులు భద్రంగా ఉన్నాయి: యనమల

  • రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందంటూ విమర్శలు
  • సర్కారు భూములు వైసీపీ నేతలకు అమ్మేస్తున్నారని ఆరోపణ
  • ఏ భూమి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడడంలేదని వ్యాఖ్యలు

మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. టీడీపీ హయాంలో ప్రజా ఆస్తులు భద్రంగా ఉన్నాయని, కానీ ఇప్పటి పరిణామాలు చూస్తుంటే త్వరలోనే ప్రభుత్వ కార్యాలయాల అమ్మకం కూడా చూడాల్సి వస్తుందేమోనని వ్యాఖ్యానించారు. అవి కూడా కేవలం వైసీపీ కార్యకర్తలకే దక్కుతాయని తెలిపారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన వల్ల ఏ భూమి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడడం లేదని విమర్శించారు. సర్కారు భూములను వైసీపీ నేతలకు చవకగా అమ్ముతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూముల అమ్మకం చూస్తుంటే నవరత్నాల అమలులో వైసీపీ ప్రభుత్వం విఫలమైనట్టు స్పష్టమవుతోందని తెలిపారు. ప్రభుత్వం ఉన్నది ప్రజా ఆస్తులు కాపాడేందుకేనని, భుజించేందుకు కాదని యనమల హితవు పలికారు.

Yanamala
Telugudesam
YSRCP
Jagan
Andhra Pradesh
  • Loading...

More Telugu News