KTR: ఆస్ట్రేలియా-భారత్ నాయకత్వ సదస్సుకు రావాలంటూ కేటీఆర్ కు ఆహ్వానం

  • డిసెంబరు 8,9 తేదీల్లో సదస్సు
  • సదస్సుకు ఆతిథ్యమిస్తున్న మెల్బోర్న్ నగరం
  • కేటీఆర్ కు లేఖ రాసిన నిర్వాహకులు

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఆస్ట్రేలియా నుంచి ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియా-భారత్ లీడర్ షిప్ సదస్సుకు రావాలంటూ నిర్వాహకులు కేటీఆర్ ను కోరారు. ఈ సదస్సు మెల్బోర్న్ వేదికగా డిసెంబరు 8,9 తేదీల్లో జరగనుంది. హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియానే ఎంచుకుంటున్న నేపథ్యంలో అనేక అంశాలపై చర్చించేందుకు ఇది సరైన వేదికగా నిలుస్తుందని సదస్సు నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ కు లేఖ రాశారు. ఈ సదస్సుకు భారత్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన ప్రభుత్వ, వాణిజ్య రంగాలకు చెందిన కీలక వ్యక్తులు, ప్రతినిధులు హాజరవుతారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News