Akshay Kumar: షూటింగ్ లో అక్షయ్ కుమార్ కు గాయం.. అయినప్పటికీ షూటింగ్ లో పాల్గొన్న వైనం.. వీడియో ఇదిగో

  • ముంబయిలో జరుగుతోన్న ‘సూర్యవంశి’ సినిమా షూటింగ్ 
  • ఎడమ చేయికి ప్యాచ్
  • ఓ వీడియోలోనూ కనపడ్డ ప్యాచ్

ముంబయిలో జరుగుతోన్న ‘సూర్యవంశి’ సినిమా షూటింగ్ సెట్స్ లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎడమ చేతికి గాయమైంది. ఆయన ఎడమ చేయి కండరం బెణికిందని, ప్రస్తుతం దానికి ఆయన ప్యాచ్ వేసుకున్నారని తెలిసింది. గాయమైనప్పటికీ ఆయన షూటింగ్ ను వదిలేసి వెళ్లలేదు. గాయానికి ప్యాచ్ వేసుకొనే షూటింగ్ లో పాల్గొంటూ తన పని పట్ల తనకు ఉన్న నిబద్ధతను చాటుకున్నారు.

‘సూర్యవంశి’ సినిమాలో అక్షయ్ కు జోడీగా కత్రినా కైఫ్ నటిస్తోంది. ఓ రొమాంటిక్ క్లిప్ ను అక్షయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అందులోనూ తన ఎడమచేయికి ఉన్న బ్లాక్ ప్యాచ్ కనపడింది. కాగా, ఈ సినిమాకు యాక్షన్ చిత్రాల డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్, అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నారు. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ దీన్ని నిర్మిస్తున్నారు.

Akshay Kumar
Bollywood
  • Loading...

More Telugu News