Finland: వేలాది 'మంచు గుడ్లు'.. అబ్బుర పరుస్తోన్న ఫొటోలు

- ఫిన్లాండ్ లోని బీచ్ లో దృశ్యాలు
- ఫొటోలు తీసిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ రిస్టో మాటిలా
- వాతావరణంలో మార్పుల వల్ల గుడ్లు, బంతుల్లా మంచు
సాగర తీరాన నడుచుకుంటూ వెళ్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంటే మన మనసు గాలిలో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి చాలా మంది సాగర తీరానికి చేరుకుంటారు. ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం బీచ్ కు వెళ్లిన ఫిన్లాండ్ వాసులు ఇటీవల అపురూప దృశ్యాలను చూశారు.


ఇటువంటి అద్భుతమైన దృశ్యాలను తాము ఎన్నడూ చూడలేదని పర్యాటకులు మీడియాకు తెలిపారు. ఉష్ణోగ్రత భారీగా పడిపోయి సముద్ర ఒడ్డున ఈ ఆకారాల్లో మంచు ముక్కలు రూపుదిద్దుకున్నాయని చెప్పారు. ఫిన్లాండ్, స్వీడన్ మధ్య ఉన్న ఓ ద్వీపంలో ఈ బీచ్ ఉంటుంది. గతంలోనూ పలు దేశాల్లోని బీచుల్లో ఇటువంటి దృశ్యాలు అరుదుగా కనపడ్డాయి.