KPL: ఇంటర్నేషనల్ క్రికెట్ బుకీ సయ్యమ్ అరెస్ట్... సెలబ్రిటీ డ్రమ్మర్ భవేశ్ పై లుకౌట్ నోటీసులు!

  • ప్రకంపనలు రేపుతున్న కేపీఎల్ ఫిక్సింగ్ వ్యవహారం
  • గౌతమ్ ను విచారించిన తరువాత మరిన్ని అరెస్టులు
  • బెంగళూరు పోలీసుల అదుపులో హర్యానా బుకీ

కేపీఎల్‌ లో ( కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌) మ్యాచ్‌ లను ఫిక్సింగ్‌ చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై అంతర్జాతీయ బుకీని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీఎల్ ఫిక్సింగ్ వ్యవహారం ఇప్పటికే కలకలం రేపగా, క్రికెటర్ గౌతమ్ ను గత వారం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అతన్ని విచారించిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు, ఫిక్సింగ్‌ చేయడానికి యత్నించిన హర్యానా వ్యక్తి సయ్యమ్‌ ను అదుపులోకి తీసుకున్నారు.

సెలబ్రేటీ డ్రమ్మర్‌, ఎన్నో మ్యాచ్ లలో పాల్గొని, తన నైపుణ్యంతో క్రీడాభిమానులను అలరించిన భవేశ్‌ బఫ్నా సాయంతో సయ్యమ్, మ్యాచ్‌ లను ఫిక్స్‌ చేయడానికి చూసినట్టు పోలీసులు తేల్చారు. ప్రస్తుతం భవేశ్ బఫ్నా ఆచూకీ తెలియకపోవడంతో లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు.

KPL
Buki
Haryana
Sayyam
Bhavesh
Drummer
Bengalore
  • Loading...

More Telugu News