Crime News: తనకు దక్కలేదని...అక్కసుతో ప్రియుడి భార్యపై హత్యా యత్నం

  • ప్రేమించిన విషయం చెప్పకుండా మనసులో దాచుకున్న యువతి
  • వేరే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు
  • దీంతో మనస్తాపానికి గురైన ప్రియురాలు దారుణం

ప్రేమించిన విషయం ప్రియుడికి చెప్పకుండా, అతను మరో మహిళ సొంతమవ్వడాన్ని తట్టుకోలేని ఓ యువతి నవ వధువును చంపేందుకు చేసిన ప్రయత్నం అనంతపురం జల్లా కేంద్రంలో సంచలనం రేపింది. ఈ ఘటనపై పోలీసులు తెలిసిన వివరాలు ఇలావున్నాయి. పట్టణంలోని మహాత్మాగాంధీ కాలనీకి చెందిన శ్రీనివాసులు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇతడిని చాలాకాలంగా ప్రేమిస్తోంది. కానీ ఈ విషయం శ్రీనివాసులకు ఆమె ఎప్పుడూ చెప్పలేదు. కాగా శ్రీనివాసులు, మహేశ్వరి (19) అనే మరో యువతిని ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి ఇటీవల పెళ్లి చేసుకున్నాడు.

ఈ విషయం తెలియడంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. తనకు దక్కాల్సిన శ్రీనివాసులును మహేశ్వరి దక్కించుకుందని రగిలిపోయింది. ఆమెను ఎలాగైనా అడ్డుతొలగించుకుంటే శ్రీనివాసులు తనవాడైపోతాడని భావించింది.

నిన్న శ్రీనివాసులు ఇంట్లో మహేశ్వరి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి ఆమెతో వాగ్వాదానికి దిగింది. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి పరారయింది. బాధితురాలి కేకలు విన్న స్థానికులు హుటాహుటిన మహేశ్వరిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

Crime News
Anantapur District
murder attept
lover
wife
  • Loading...

More Telugu News