Yadadri Bhuvanagiri District: దొంగల స్వైరవిహారం... నాలుగు గ్రామాల్లోని 12 ఇళ్లలో దొంగతనం!

  • యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
  • ఈ తెల్లవారుజామున దొంగతనాలు
  • వివరాలు సేకరించిన పోలీసులు

ఒక్క రాత్రిలోనే దొంగలు స్వైర విహారం చేశారు. నాలుగు గ్రామాలపై విరుచుకుపడి, 12 ఇళ్లలో దొంగతనాలు చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు, తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ గా చేసుకున్న దొంగల ముఠా, పదునైన ఇనుప పనిముట్లను తెచ్చుకుని, తాళాలను పగులగొట్టి, ఇంట్లో దొరికిన విలువైన వస్తువులు, బంగారం, నగదును పట్టకెళ్లారు.

సాయిగూడెం, కొళ్లూరు, చారాజీపేట, టంగుటూరు గ్రామాల్లో ఈ దొంగతనాలు జరిగాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, దొంగతనాలు జరిగిన ప్రాంతాలకు వెళ్లి, వివరాలు సేకరించారు. దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, కేసును విచారిస్తున్నామని తెలిపారు. అన్ని దొంగతనాలూ నేటి తెల్లవారుజామునే జరిగాయని వెల్లడించారు.

Yadadri Bhuvanagiri District
Theft
Police
  • Loading...

More Telugu News