Ayodhya verdict: మహాత్మాగాంధీ హత్యపై ఇప్పుడు విచారణ జరిగితే తీర్పు ఎలా ఉండేదో తెలుసా?: గాంధీ మనవడు

  • అయోధ్యపై తుది తీర్పును వెల్లడించిన సుప్రీంకోర్టు 
  • గాంధీని చంపిన గాడ్సేను ఇప్పుడైతే దేశభక్తుడని పేర్కొనేది
  • దేశాన్ని బాధిస్తున్న ఇతర సమస్యలపై దృష్టి సారిద్దాం

సుదీర్ఘంగా సాగిన అయోధ్య రామజన్మభూమి వివాదం ఇక ముగిసిన అధ్యాయం. నిన్నటి సుప్రీంకోర్టు చారిత్రక తీర్పుతో ఈ వివాదానికి తెరపడింది. వివాదాస్పద భూమి హిందువులదేనని సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది. దానిని హిందువులకు అప్పగించాలని, ముస్లింలు మసీదును కట్టుకునేందుకు అయోధ్యలోనే ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సుప్రీంకోర్టు తీర్పుపై మహాత్మాగాంధీ మనవడు తుషార్ గాంధీ స్పందించారు. సుప్రీంకోర్టు కనుక ఈ రోజు మహాత్మాగాంధీ హత్య కేసును విచారించి ఉంటే నాథూరామ్ గాడ్సే గొప్ప దేశభక్తుడు అయి ఉండేవాడని అన్నారు. గాంధీని చంపిన గాడ్సే హంతకుడే అయినప్పటికీ అతడో దేశభక్తుడని తీర్పు వచ్చేదని తుషార్ గాంధీ అన్నారు. దేశాన్ని బాధిస్తున్న ఇతర సమస్యలపై దయచేసి  దృష్టి సారిద్దామని తుషార్ గాంధీ అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News