Ponnala Lakshmaiah: కేసీఆర్ కు కనీస మానవత్వం లేదు: కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య

  • రాష్ట్రంలో పోలీసుల పాలన సాగుతోందంటూ ఆగ్రహం
  • కేసీఆర్ నియంతను తలపిస్తున్నారని మండిపాటు
  • చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో వ్యాఖ్యలు

తెలంగాణలో పోలీసు పాలన సాగుతోందని, కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు, ప్రజలు, నేతల పట్ల పోలీసుల ప్రవర్తన రజాకార్లను తలపించిందని మండిపడ్డారు. హన్మకొండలోని తన నివాసంలో లక్ష్మయ్య మాట్లాడుతూ ‘ కేసీఆర్ ఓ నియంత, ఆయనకు కనీస మానవత్వం లేదు’ అని అన్నారు. చలో ట్యాంక్ బండ్  విజయవంతం చేసినందుకు ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.

Ponnala Lakshmaiah
PCC EX chief
comments On KCR
  • Loading...

More Telugu News