Dwaraka Shankaracharya swamy Swarupnanda saraswathi: అయోధ్య తీర్పుపై జగద్గురు స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలు
- సుప్రీం కోర్టు తీర్పు సంతోషం కలిగించిందని వెల్లడి
- రామమందిరం నిర్మించడానికి ట్రస్ట్ ఇప్పటికే ఉందన్న స్వరూపానంద
- అంగ్‌కోర్ వాట్ దేవాలయం తరహాలో రామ మందిరం నిర్మించాలని అభిలాష
అయోధ్య వివాదంపై ఈరోజు వెలువడిన సుప్రీం కోర్టు తీర్పుపట్ల ద్వారక పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి సంతోషం వ్యక్తం చేశారు. శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో అది నిరూపితమైందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా ఉన్న కాంబోడియాలోని అంగర్ కోట్ దేవాలయం అంత గొప్పగా రామ మందిరం ఉండాలని అభిలషించారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్న కోర్టు ఆదేశంపై స్వామి స్పందిస్తూ.. గతంలో పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇప్పటికే ఉందని చెప్పారు. సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించాలన్న సుప్రీం ఆదేశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.