Ayodhya verdict: అయోధ్య తీర్పు... యూపీలో పరిస్థితి ప్రశాంతం!: డీజీపీ ఓపీ సింగ్

  • ముందస్తు ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉన్నామని వెల్లడి
  • అత్యవసర ఆపరేషన్ కేంద్రం(ఈవోసీ)ను ఏర్పాటు చేశామన్న డీజీపీ
  • పరిస్థితిని సమీక్షించిన సీఎం

అయోధ్య వివాదం కేసుపై ఈ రోజు వెలువడ్డ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ లో పరిస్థితి ప్రశాంతంగా కనిపిస్తోంది. ముందస్తుగా రాష్ట్రంలో భారీస్థాయిలో బలగాలను మోహరించడంతో ఇది సాధ్యమైందని డీజీపీ ఓపీ సింగ్ మీడియాకు తెలిపారు. తీర్పు వెలువడుతుందని తెలిసి శాంతి భద్రతలపై తాము అప్రమత్తంగా ఉన్నామన్నారు. సిబ్బంది అనుక్షణం పరిస్థితులను సమీక్షిస్తూ ముందుకు సాగారని చెప్పారు.

అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటాయన్న ముందస్తు సమాచారంమేరకు తొలిసారిగా అత్యవసర ఆపరేషన్ కేంద్రం(ఈవోసీ)ను ఏర్పాటు చేసినట్లు సింగ్ తెలిపారు. ఈ కేంద్రంలో  సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్, ఎస్ ఎస్ బీ, ఐటీబీపీ, సీఐఎస్ ఎఫ్, జీఆర్పీ బలగాలు అవిశ్రాంతంగా పనిచేస్తుంటాయన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఏర్పాట్లను సమీక్షించారన్నారు.  ఇప్పటివరకు అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు సమాచారం రాలేదన్నారు.

  • Loading...

More Telugu News