Ayodhya: భారత్ మాతాకీ జై... 'అయోధ్య' తీర్పుపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

  • అయోధ్య భూవివాదంపై సుప్రీం తీర్పు
  • చారిత్రాత్మక నిర్ణయం అంటూ ట్వీట్ చేసిన పవన్
  • స్వచ్ఛమైన విజ్ఞత అంటూ ప్రశంసలు

దశాబ్దాల తరబడి అటు ప్రభుత్వాలకు, ఇటు న్యాయవ్యవస్థకు చిక్కుముడిలా నిలిచిన అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు అంతిమతీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. సాంత్వన కలిగించేలా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు భారత న్యాయవ్యవస్థ స్వచ్ఛమైన విజ్ఞతకు దర్పణం పడుతోందని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ధర్మాన్ని పరిరక్షించేలా తీర్పు ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు భారతీయులుగా తామందరం హృదయపూర్వక సమ్మతి తెలుపుతున్నామని పేర్కొన్నారు. చివరగా 'భారత్ మాతాకీ జై' నినాదంతో ట్వీట్ ముగించారు.

Ayodhya
Supreme Court
Pawan Kalyan
Jana Sena
  • Loading...

More Telugu News