Ashok Galla: అశోక్ గల్లా సినిమా ఓపెనింగ్ కు రామ్ చరణ్!
![](https://imgd.ap7am.com/thumbnail/tn-6ec510142d87.jpg)
- వెండితెరకు పరిచయం అవుతున్న గల్లా జయదేవ్ తనయుడు
- శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చిత్రం
- రేపు రామానాయుడు స్టూడియోలో ముహూర్తం షాట్
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మహేశ్ బాబు మేనల్లుడు కావడంతో అశోక్ గల్లాపై ఘట్టమనేని అభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా నటిస్తున్న చిత్రం ఓపెనింగ్ సెర్మనీ రేపు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరగనుంది. ఈ ముహూర్తం షాట్ కు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వస్తున్నాడు. దాంతో మెగా అభిమానుల దృష్టి రేపటి ఈవెంట్ పై పడింది. అశోక్ గల్లా సరసన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.