Kanna: సత్యమేవ జయతే... శతాబ్దాల సమస్యకు పరిష్కారం లభించింది: కన్నా

  • అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తుదితీర్పు
  • సోషల్ మీడియాలో కన్నా స్పందన
  • భిన్నత్వంలో ఏకత్వం నిరూపించాల్సిన సమయం అంటూ ట్వీట్

సుదీర్ఘకాలంగా అనేక ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టిన అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదేనని స్పష్టం చేసింది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. శతాబ్దాల సమస్యకు పరిష్కారం లభించిందని పేర్కొన్నారు.

దశాబ్దాల తరబడి సాగిన వాదోపవాదాలను విన్న తర్వాత, సాక్ష్యాల పరిశీలన అనంతరం, సత్యశోధన జరిపిన పిదప సుప్రీం కోర్టు ఆమోదయోగ్యమైన తీర్పు వెలువరించిందని వ్యాఖ్యానించారు. ఇది గెలుపోటముల విషయం కాదని, దేశ ప్రజలందరూ ఒక్కటేనంటూ భిన్నత్వంలో ఏకత్వం నిరూపించాల్సిన సమయం అని పిలుపునిచ్చారు.

Kanna
BJP
Andhra Pradesh
Ayodhya
Supreme Court
  • Loading...

More Telugu News