Chandrababu: 'అయోధ్య' తీర్పు వెల్లడి కానున్న సందర్భంగా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే: చంద్రబాబు

  • తీర్పును అందరం హృదయపూర్వకంగా స్వీకరించాలి
  • సంయమనం పాటించాలి, మత సామరస్యం కాపాడాలి
  • సమసమాజ నిర్మాణమే మన అంతిమలక్ష్యం కావాలి

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదుపై కాసేపట్లో సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో 40 రోజుల పాటు రోజువారీ విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గత నెల 16న తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చాలా సున్నితమైన ఈ కేసులో తీర్పు వెల్లడి కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.

'అయోధ్య విషయమై తీర్పు వెలువడబోతున్న సందర్భంగా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా అందరం హృదయపూర్వకంగా ఆ తీర్పును స్వీకరించాలి. సంయమనం పాటించాలి, మత సామరస్యం కాపాడాలి. శాంతి, సౌభ్రాతృత్వంతో సమసమాజ నిర్మాణమే మన అంతిమలక్ష్యం కావాలి' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News