Telugu: జిమ్ లో చిరంజీవి ఖతర్నాక్ కసరత్తులు!

  • కుర్ర హీరోలకు దీటుగా వ్యాయామం
  • డంబెల్స్ తో అవయవ సౌష్ఠవం కాపాడుకుంటున్న చిరంజీవి 
  • కొరటాల శివ దర్శకత్వంలో నిర్మించే సినిమా కోసం మెగా శ్రమ! 

64 ఏళ్ల వయసులోనూ మెగాస్టార్ చిరంజీవి జిమ్‌లో కసరత్తులు చేస్తూ కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన చిరంజీవి స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగారు. యువ హీరోల హవా నడుస్తున్న ప్రస్తుత కాలంలో 'సైరా నరసింహారెడ్డి'లో నటించి హిట్ అందుకున్నారు.

తాజాగా ఆయన కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభంకానుంది. దీనికోసమే ఆయన జిమ్ కు వెళ్లి కసరత్తులు చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ నుంచి సామాజిక కార్యకర్తగా మారిన ఒక నడివయస్కుడి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. జిమ్ లో చిరంజీవి డంబెల్స్ ఎత్తుతోన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వయసులో ఆయన పడుతున్న తపన, కష్టం, వృత్తి పట్ల ఆయనకున్ననిబద్ధతను చాటుతోంది.

Telugu
Actor
Chiranjeevi
New picture
Koratala Siva
64 Years old
Jim Exercise
  • Loading...

More Telugu News