Tammineni Sitharam: ఇలాంటి ట్రెండ్ సెట్ చేస్తారనుకోలేదు... ఘాటైన పదజాలంతో స్పీకర్ తమ్మినేనికి నారా లోకేశ్ బహిరంగ లేఖ

  • చంద్రబాబు, లోకేశ్ లపై స్పీకర్ వ్యాఖ్యలు
  • మండిపడుతున్న టీడీపీ నేతలు
  • స్పీకర్ పై లోకేశ్ విమర్శల జడివాన

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ నేతలు తమ అస్త్రాలు ఎక్కుపెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లపై సీతారామ్ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. హాయ్ లాండ్ భూములను కొట్టేసేందుకు తండ్రీకొడుకులు కుట్రలు చేశారంటూ స్పీకర్ ఆరోపించారు. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా పరుష పదజాలంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు బహిరంగ లేఖ రాశారు.

బడుగు, బలహీన వర్గాలకు చెందిన తమరు స్పీకర్ పదవిని చేపడితే ఆ పదవికే వన్నె తెస్తారని భావించామని, కానీ అసభ్య పదజాలంతో మాట్లాడుతూ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తారని ఊహించలేకపోయామని తెలిపారు. విలువలతో సభ నడిపిస్తానని మీరు తొలిరోజున చెప్పినప్పుడు ఎంతో సంతోషించామని, కానీ విపక్ష నేతపై మీరు చేసిన వ్యాఖ్యలతో మీపై అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. తన లేఖ నిండా నారా లోకేశ్ సునిశిత విమర్శలు, ఘాటైన వ్యాఖ్యలు సంధించారు.

ఆయన లేఖ ఇదిగో...

Tammineni Sitharam
Andhra Pradesh
Speaker
YSRCP
Jagan
  • Loading...

More Telugu News