Tady: కల్లుకుండలో నాగన్న బుసలు... హడలిపోయిన గీత కార్మికుడు!

  • హుజూరాబాద్ లో ఘటన
  • కల్లు గీసేందుకు కుండ తీసిన కార్మికుడు
  • బుసలు వినిపించడంతో ఆందోళనకు గురైన వైనం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ఆసక్తికర ఘటన జరిగింది. కల్లు కుండలో నాగుపాము చేరి అందరినీ భయాందోళనలకు గురిచేసింది. స్థానికంగా ఉండే కల్లు గీత కార్మికుడు కొమురయ్య ఎప్పట్లాగే కల్లు గీసేందుకు చెట్టుపై ఉన్న కుండను తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే అందులోంచి బుసలు వినిపించడంతో కుండను అక్కడే వదిలేసి గబగబా కిందకు దిగేశాడు. తర్వాత స్థానికులను పిలిచి కుండను కిందికి దించి చూపించగా అందులో నాగుపాము ఉన్నట్టు గుర్తించారు. ఆ కోడె త్రాచు బుసలు కొడుతూ ఉండడంతో అక్కడివాళ్లు సైతం ఆందోళన చెందారు. చివరికి ఎలాగోలా ఆ విషసర్పాన్ని కుండలోంచి వెలుపలికి పంపించగలిగారు.

Tady
Karimnagar District
Huzurabad
  • Loading...

More Telugu News