RBI: డిజిటల్ లావాదేవీలపై ఇక చార్జీలుండవు... ఆర్బీఐ నిర్ణయం

  • నెఫ్ట్ లావాదేవీలపై చార్జీలు ఎత్తివేసిన ఆర్బీఐ
  • వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు
  • అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు

డిజిటల్ చెల్లింపులు, ఇతర ఆన్ లైన్ లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్) ద్వారా జరిపే నగదు లావాదేవీలపై ఇక రుసుము ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ నిర్ణయం అమలు చేయాలని ఆర్బీఐ అన్ని బ్యాంకులకు తెలియజేసింది. ఆర్బీఐ నిర్ణయంతో ఆన్ లైన్ నగదు లావాదేవీలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News