MLA RK: తన ఐదేళ్ల జీతాన్ని విరాళంగా ఇచ్చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

  • 'కనెక్ట్ టు ఆంధ్రా' కార్యక్రమం ప్రకటించిన సీఎం జగన్
  • అసెంబ్లీ కార్యదర్శికి లేఖ అందజేసిన ఆర్కే
  • రాష్ట్రాభివృద్ధికి తనవంతు సాయం అంటూ వెల్లడి

ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఏపీ సీఎం జగన్ ప్రకటించిన 'కనెక్ట్ టు ఆంధ్రా' కార్యక్రమంపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఐదేళ్ల పాటు శాసనసభ్యుడి హోదాలో తాను అందుకునే జీతం, ఇతర భత్యాలు, సదుపాయాలకయ్యే ఖర్చు మొత్తాన్ని 'కనెక్ట్ టు ఆంధ్రా'కు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి లిఖితపూర్వకంగా తెలియజేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు తదితర పథకాల అమలు కోసం తనవంతుగా విరాళం ఇస్తున్నట్టు తెలిపారు.

MLA RK
YSRCP
Jagan
Connect To Andhra
Mangalagiri
  • Loading...

More Telugu News