TS RTC: తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయంపై హైకోర్టు స్టే
- 5,100 బస్సులు ప్రవేటు రూట్లలో నడపాలన్న నిర్ణయంపై కోర్టు ఆక్షేపణ
- తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
- కేబినెట్ తీసుకున్న నిర్ణయం కోర్టుకు తెలపాలని ఆదేశం
తెలంగాణలో 5,100 బస్సులను ప్రైవేటు రూట్లలో నడపాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఆ నిర్ణయంపై స్టే విధించింది. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణను నిలిపివేయాలని పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ వాదన పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.