super star: నాకు బీజేపీ రంగు పులమాలని కొందరు ప్రయత్నిస్తున్నారు: సూపర్ స్టార్ రజనీకాంత్

  • వారి ఉచ్చులో పడను
  • తమిళ నాట నాయకత్వ శూన్యత ఏర్పడింది
  • రాజకీయపార్టీ స్థాపించేవరకు సినిమాల్లో నటిస్తా

తాను బీజేపీలో చేరుతున్నానని వస్తోన్న వార్తల నేపథ్యంలో.. సూపర్ స్టార్ రజనీకాంత్ వాటిని ఖండిస్తూ ఒక ప్రకటన చేశారు. తనకు కొందరు బీజేపీ రంగు వేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. వారి ఉచ్చులో తాను పడనని పేర్కొన్నారు. తన గురువు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నటుడు కమలహాసన్ తో కలిసి రజనీ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు, తమిళ ప్రాచీన కవి తిరువళ్లూరు చిత్రాన్ని బీజేపీ ట్వీట్ చేయడంపై నెలకొన్న వివాదంపై మీ స్పందన ఏమిటని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, రజనీ సమాధానమిస్తూ.. తిరువళ్లూరుతో పాటు తనపై కూడా కాషాయరంగు పులమాలని ప్రయత్నిస్తున్నారంటూ చెప్పారు. తమిళనాట నాయకత్వ శూన్యత నెలకొందన్నారు. తాను రాజకీయ పార్టీ స్థాపించేవరకు సినిమాల్లో నటిస్తానని పేర్కొన్నారు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News