EPF commissioner: కార్మికుల పీఎఫ్ బకాయిలు కట్టండి.. తెలంగాణ ఆర్టీసీ ఎండీకి పీఎఫ్ కమిషనర్ నోటీసులు

  • ఆర్టీసీ యాజమాన్యానికి ప్రాంతీయ ఈపీఎఫ్ కార్యాలయం షాక్  
  • ఇప్పటివరకు చెల్లించాల్సిన బకాయిలు రూ.760కోట్లు
  • 15లోగా పూర్తి వివరాలు సమర్పించాలన్న కమిషనర్

కార్మికుల సమ్మెతో సతమతమవుతున్న టీఎస్ ఆర్టీసీ సంస్థ యాజమాన్యానికి ప్రాంతీయ ఈపీఎఫ్ కార్యాలయం షాక్ ఇచ్చింది. కార్మికుల పీఎఫ్ బకాయిలు చెల్లించాలని ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మకు నోటీసులు జారీచేశారు.

ఎప్పటికప్పుడు కార్మికుల ఖాతాల్లో జమకావాల్సిన పీఎఫ్ జమ కాలేదని, ఆ మొత్తం ఇప్పుడు రూ.760 కోట్లకు చేరిందని తెలిపారు. ఈ నెల 15లోగా పూర్తి సమాచారంతో తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఆర్టీసీ సంస్థ, రవాణా శాఖకు కూడా బకాయిలు పడింది. పన్ను బకాయిలు చెల్లించాలని ఆ శాఖ ఆర్టీసీకి ఇప్పటికే నోటీసులు పంపింది.

EPF commissioner
laboureres PF dues
Notices
Telangana
RTC MD
  • Loading...

More Telugu News