Nara Lokesh: మహిళల్ని వేధించిన పాపం ఊరికే పోదు జగన్ గారూ!: నారా లోకేశ్

  • నాలుగు లక్షల మంది వైకాపా కార్యకర్తలకు ఉద్యోగాలిచ్చారు
  • 10 లక్షల మంది ఉద్యోగులపై వేటు వేశారు 
  • ఒకే ఒక్క సంతకంతో 27,700 మంది వెలుగు యానిమేటర్లని రోడ్ల పైకి నెట్టారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 10 లక్షల మంది ఉద్యోగులపై వేటు వేశారని ఆరోపించారు. 'నాలుగు లక్షల మంది వైకాపా కార్యకర్తలకు ఉద్యోగాలివ్వడం కోసం,10 లక్షల మంది ఉద్యోగులపై వేటు వేశారు జగన్ గారు. పాదయాత్రలో అక్క, చెల్లీ మీ జీతం పదివేల రూపాయలు చేస్తానన్న జగన్ గారు ఒకే ఒక్క సంతకంతో 27,700 మంది వెలుగు యానిమేటర్లని రోడ్ల పైకి నెట్టేసి, వారి జీవితాల్లో వెలుగు లేకుండా చేశారు' అని ట్వీట్ చేశారు.
 
'మహిళల్ని వేధించిన పాపం ఊరికే పోదు జగన్ గారు. ఒక్క ఉద్యోగం కూడా తియ్యడానికి వీలు లేదు. వెలుగు యానిమేటర్లకి అండగా మేము ప్రత్యక్ష పోరాటం మొదలు పెడతాం. మీరు ఇచ్చిన ఉత్తర్వులు తక్షణమే వెనక్కి తీసుకోవాలి. 27,700 యానిమేటర్లని తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News