Devendra Fadnavis: ఈరోజు రాజీనామా చేయనున్న దేవేంద్ర ఫడ్నవిస్?

  • గవర్నర్ కు రాజీనామా లేఖ అందించనున్న ఫడ్నవిస్
  • హైకమాండ్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న సీఎం
  • శివసేనకు నచ్చజెప్పేందుకు బీజేపీ చేసిన యత్నాలన్నీ విఫలం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ ఈరోజు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తారని సమాచారం. అయితే, పార్టీ హైకమాండ్ ఆదేశాల కోసం ఆయన వేచిచూస్తున్నారు. ఈ అర్ధరాత్రితో మహారాష్ట్ర శాసనసభ కాలపరిమితి ముగియనుంది.

సీఎం పదవికి పట్టుబడుతున్న శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు కలసిరాకపోవడంతో... మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. మరోవైపు శివసేనకు నచ్చజెప్పేందుకు బీజేపీ చేసిన యత్నాలన్నీ విఫలమయ్యాయి. నిన్న రాత్రి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేతో చర్చించేందుకు ఆయన నివాసానికి హిందూ నేత శంభాజీ భిడే వెళ్లారు. అయితే, ఆ సమయంలో ఇంట్లో ఉద్ధవ్ లేకపోవడంతో... ఈ చివరి ప్రయత్నం కూడా విఫలమైంది. దీనిపై శివసేన శ్రేణులు స్పందిస్తూ, శంభాజీ వస్తున్నట్లు తమకు ముందస్తు సమాచారం లేదని, అందుకే ఆయనను ఉద్ధవ్ కలవలేకపోయారని వెల్లడించాయి.

Devendra Fadnavis
Uddhav Thackeray
Shivsena
BJP
Maharashtra
  • Loading...

More Telugu News