speaker: స్పీకర్‌ తమ్మినేనికి మతిభ్రమించినట్టుంది...అందుకే రాజకీయాలు మాట్లాడుతున్నారు: మాజీ మంత్రి జవహర్‌ ఘాటు విమర్శలు

  • ఆయన బాధ్యతగల హోదాలో ఉన్నారు
  • అది మర్చిపోయి విలువలను తాకట్టు పెట్టవద్దు
  • రాజకీయాలే కావాలంటే స్పీకర్‌ పదవికి రాజీనామా చేయాలి

బాధ్యతాయుతమైన స్పీకర్‌ పదవిలో ఉంటూ తమ్మినేని సీతారాం రాజకీయాలు మాట్లాడడం చూస్తుంటే జనం నవ్వుకుంటున్నారని, ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారేమోనని అభిప్రాయపడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు జవహర్‌ మండిపడ్డారు. విజయవాడ సమీపంలోని హాయ్‌ల్యాండ్‌ను కొట్టేసేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ పక్కాప్లాన్‌ వేశారంటూ నిన్న అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కుల పంపిణీ సందర్భంగా జరిగిన సభలో తమ్మినేని తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై జవహర్‌ స్పందిస్తూ తమ్మినేని తన ఉనికిని చాటుకునేందుకు బాధ్యతగల తన హోదాను ముఖ్యమంత్రి జగన్‌కు తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. స్పీకర్‌ రాజకీయ ప్రకటనలు చేయడం సరికాదని, ఆయనకు అంతగా మోజు ఉంటే స్పీకర్‌ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని జవహర్‌ హితవు పలికారు. జగన్‌ వద్ద మెప్పుపొందేందుకు చంద్రబాబు కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని స్పష్టం చేశారు.

speaker
tammineni
javahar
Chandrababu
  • Loading...

More Telugu News