Narendra Modi: అద్వానీ జన్మదినం.. ఇంటికొచ్చి శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్య నాయుడు, మోదీ, అమిత్ షా!

- 92వ వసంతంలోకి అడుగుపెట్టిన అద్వానీ
- శుభాకాంక్షల వెల్లువ
- అద్వానీజీ ఓ రాజనీతిజ్ఞుడు: మోదీ
భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఈ రోజు 92వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు ఉదయం అద్వానీ నివాసానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వెళ్లారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కాసేపు మాట్లాడారు.

