Virat Kohli: కోహ్లీ దుస్తులు నేను వేసుకోవడానికి కారణం ఇదే: అనుష్క శర్మ

  • కోహ్లీ వార్డ్ రోబ్ లో ఎన్నో దుస్తులు ఉంటాయి
  • నాకు నచ్చినవి తీసుకుని వేసుకుంటుంటాను
  • నా భర్త దుస్తులు ధరించినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలది అన్యోన్యమైన జంట అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుస టూర్లతో కోహ్లీ, వరుస సినిమాలతో అనుష్కలు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ... ఇద్దరికీ ఏ మాత్రం చిన్న సమయం దొరికినా ఆ సమయాన్ని ఎంతో ఆస్వాదిస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ, ఓ ఆసక్తిక విషయాన్ని వెల్లడించింది.

తన భర్త కోహ్లీ దుస్తులను దొంగిలించి వేసుకుంటానని అనుష్క తెలిపింది. కోహ్లీ వార్డ్ రోబ్ లో ఎన్నో దుస్తులు ఉంటాయని, వాటిలో తనకు నచ్చినవి తీసుకుని వేసేసుకుంటుంటానని చెప్పింది. ఎందుకంటే తన భర్త దుస్తులను ధరించినప్పుడు తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ జంట భూటాన్ లో షికారు చేస్తోంది. వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Virat Kohli
Anushka Sharma
Team India
Bollywood
  • Loading...

More Telugu News