BSNL: బీఎస్ఎన్ఎల్ లో స్వచ్ఛంద పదవీ విరమణకు అనూహ్య స్పందన

  • రెండు రోజుల్లో 22 వేల దరఖాస్తులు
  • దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 3
  • ఎంటీ ఎన్ ఎల్ లో కూడా కొనసాగుతున్న వీఆర్ఎస్ ప్రక్రియ

నష్టాల్లో కొనసాగుతున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్  సంస్థల్లో స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ ఎస్) ప్రకటనకు ఉద్యోగులనుంచి భారీ స్పందన కనిపిస్తోంది. ఇటీవల ఈ రెండు కంపెనీలను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిలోని ఉద్యోగులకు వీఆర్ఎస్ తీసుకోవచ్చంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రారంభమైన రెండు రోజుల్లేనే ఒక్క బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులనుంచే 22వేల దరఖాస్తులు వచ్చాయని సంస్థ అధికారులు తెలిపారు.

ఈ నెల 5న ప్రారంభమైన వీఆర్ ఎస్ పథకం డిసెంబర్ 3న ముగియనుంది. తొలి రెండు రోజుల్లో వచ్చిన దరాఖాస్తుల్లో 13 వేల దరఖాస్తులు గ్రూప్ సి తరగతికి చెందిన ఉద్యోగులవేనని అధికారులు పేర్కొన్నారు. బీఎస్ ఎన్ ఎల్ లో మొత్తం లక్షా యాబైవేలమంది ఉద్యోగులున్నారన్నారు. వీరిలో యాబై ఏళ్ల వయసు మీరిన లక్షమంది వీఆర్ ఎస్ కు అర్హులుగా ఉండగా, వారిలో 70 నుంచి 80 వేల మంది వీఆర్ ఎస్ తీసుకుంటారని బీఎస్ ఎన్ ఎల్ భావిస్తున్నట్లు తెలిపారు. ఇదే జరిగితే సంస్థకు నెలకు ఏడువేల కోట్ల రూపాయల మేర వ్యయం తగ్గుతుందని అధికారులు వెల్లడించారు.

BSNL
MTNL
VRS
two days applications received
last date december 3
  • Loading...

More Telugu News