Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ కమిటీల నియామకం
- కమిటీలకు కొత్త ఛైర్మన్, సభ్యులను నియమించిన ప్రభుత్వం
- రూల్స్ కమిటీ ఛైర్మన్ గా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం
- ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం పలు అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది. ఆయా కమిటీలకు కొత్తగా సభ్యులను, ఛైర్మన్లను నియమించినట్టు తెలిపింది. రూల్స్ కమిటీ ఛైర్మన్ గా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను నియమిస్తూ సభ్యులుగా ఆరుగురిని నియమించినట్లు తెలిపింది.
ఇక ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పేరును ప్రకటించగా, పిటిషన్ కమిటీ ఛైర్మన్ గా డిప్యూటీ స్పీకర్ కోన రఘపతిని, ఆరుగురు సభ్యులను నియమించినట్లు పేర్కొంది. ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ గా అంబటి రాంబాబు, సభా హక్కుల కమిటీ ఛైర్మన్ గా కాకాని గోవర్ధన్ రెడ్డిని నియమించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.