JC Diwakar Reddy: రాజకీయంగా చివరిదశలో ఉన్న జేసీతో మాకేం పని?: ఏపీ మంత్రి పేర్ని నాని

  • వైసీపీలోకి రావాలని ఒత్తిడి చేస్తున్నారని జేసీ ఆరోపణ
  • దీటుగా బదులిచ్చిన పేర్ని నాని
  • వైసీపీలోకి ఆయన్ని ఎవరూ ఆహ్వానించలేదని వెల్లడి

వైసీపీలోకి రావాలని తనపై ఒత్తిడి పెంచుతున్నారని, అందులో భాగంగానే బస్సులు సీజ్ చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి పేర్ని నాని దీటుగా బదులిచ్చారు. బస్సుల సీజ్ విషయంలో జేసీ అబద్ధాలు చెబుతున్నారని, చట్ట ప్రకారమే బస్సులను సీజ్ చేశామని తెలిపారు. అయినా, జేసీని వైసీపీలోకి రావాలంటూ ఒత్తిడి చేస్తున్నారనడంలో నిజం లేదని నాని స్పష్టం చేశారు. ఆయనను వైసీపీలోకి రావాలంటూ ఎవరూ ఆహ్వానించలేదని, అయినా, రాజకీయ కెరీర్ లో చివరిదశలో ఉన్న జేసీతో మాకేం పని? అంటూ తేలిగ్గా తీసిపారేశారు.

JC Diwakar Reddy
Perni Nani
Andhra Pradesh
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News