Jagan: మద్య నియంత్రణ విధానంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్
- బార్ల సంఖ్యను తగ్గించాలన్న సీఎం జగన్
- జనవరి 1 నుంచి నిర్ణయం అమలు
- ప్రజలకు ఇబ్బందిలేని ప్రదేశాల్లోనే బార్లు
ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ మద్య నియంత్రణ విధానంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బార్ల సంఖ్యను తగ్గించాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని, బార్లకు అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్త వహించాలని అన్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లలో మద్యం లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.