VHP: త్వరలో అయోధ్య తీర్పు... శిల్పాలు చెక్కే పనులు నిలిపివేసిన వీహెచ్ పీ

  • 1990 నుంచి శిలలు చెక్కుతున్న వీహెచ్ పీ
  • మరి కొన్నిరోజుల్లో తేలిపోనున్న అయోధ్య భవితవ్యం
  • తీర్పుకు సిద్ధమవుతున్న సుప్రీం కోర్టు

ఎన్నో దశాబ్దాలుగా వీడని చిక్కుముడిలా ఉండిపోయిన అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు మరి కొన్నిరోజుల్లో చారిత్రక తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో తాము నిర్వహిస్తున్న పనులను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.

90వ దశకం ఆరంభం నుంచి అయోధ్యలో రాతి శిల్పాలను చెక్కుతున్నారు. ఆలయ నిర్మాణానికి ఆమోదం వస్తే ఆ శిల్పాలతో భారీ ఆలయం నిర్మించాలన్నది వీహెచ్ పీ ఆశయం. అయితే సుప్రీం తీర్పు రాబోతున్న తరుణంలో శిల్పాలు చెక్కే కార్యక్రమాలకు విరామం ప్రకటించారు. ఈ మేరకు వీహెచ్ పీ అధికార ప్రతినిధి శరద్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. తీర్పు వచ్చిన తర్వాత రామజన్మభూమి న్యాస్ నిర్ణయం ప్రకారం శిల్పాలు చెక్కే పనుల కొనసాగింపు ఉంటుందని శర్మ వెల్లడించారు.

  • Loading...

More Telugu News