Vijayareddy: తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ మృతి.. వైద్యుల ప్రకటన!

  • ప్రకటించిన ఉస్మానియా వైద్యులు
  • ఈ నెల 4న విజయారెడ్డి సజీవదహనం
  • తాను కూడా ఆత్మహత్యకు యత్నించిన సురేశ్
  • ఉస్మానియాలో చికిత్స పొందుతూ నేడు మృతి

తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేశ్ మృతి చెందాడు. సురేశ్ మరణించినట్టు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. చికిత్స పొందుతూ చనిపోయాడని డాక్టర్లు పేర్కొన్నారు. ఈ నెల 4న అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని ఆమె ఆఫీసులోనే సురేశ్ పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రంగా గాయపడిన సురేశ్ ను ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి క్రమంగా విషమిస్తోందని వైద్యులు ఇంతకుముందే వెల్లడించారు.

Vijayareddy
Telangana
Suresh
Usmania
Hyderabad
Abdullapurmet
  • Loading...

More Telugu News