Jagan: ఒక్క క్లిక్ తో 3.70 లక్షల మంది ఖాతాల్లో డబ్బులేసిన సీఎం జగన్... తనకు డబ్బులు పడ్డాయని మొబైల్ చూపుతూ అగ్రిగోల్డ్ బాధితుడి ఆనందం!

- బాధితులకు డబ్బు పంపిణీ మొదలు
- రూ. 10 వేలకన్నా తక్కువ డిపాజిట్ చేసిన వారి ఖాతాల్లో జమ
- గుంటూరులో ప్రారంభించిన వైఎస్ జగన్
అగ్రిగోల్డ్ బాధితుల్లో రూ. 10 వేల కన్నా తక్కువ డిపాజిట్ చేసిన వారికి డబ్బుల పంపిణీ ఈ ఉదయం మొదలైంది. సీఎం వైఎస్ జగన్ ఒక్క క్లిక్ తో 3.70 లక్షల మంది ఖాతాల్లోకి మొత్తం రూ. 264 కోట్లను బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభకు హాజరైన ఆయన ఆన్ లైన్ విధానంలో డబ్బు బట్వాడా చేశారు. మిగిలిన వారికి కూడా న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని చెప్పారు.
