Anantapur District: లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారు: మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి విమర్శ

  • పార్టీలో చేరేలా ఒత్తిడి పెంచుతున్నారు
  • నా బస్సును సీజ్‌ చేయడం అందులో భాగమే
  • భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువ అయ్యే అవకాశం

సీనియర్‌ నాయకుడు, అనంతపురం జిల్లా టీడీపీ ప్రతినిధి జె.సి.దివాకర్‌రెడ్డి జగన్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మనుషులను, సంస్థలను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసులు బనాయిస్తోందని ధ్వజమెత్తారు. అన్నివైపుల నుంచి ఒత్తిడులు పెంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేయడమే ఈ కేసుల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. జేసీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు సీజ్‌ చేయడం కూడా ఇందులో భాగమేనన్నారు.

దశాబ్దాలుగా రవాణా వ్యాపారంలో తాను ఉన్నానని, నిబంధనలు అతిక్రమించిన సందర్భాలు ఎప్పుడూ లేవని అన్నారు. అయినా మా బస్సులు సీజ్‌ చేస్తున్నారంటే లక్ష్యం మేరకేనన్నారు. లేదంటే మిగిలిన సంస్థల బస్సులు ఎన్ని సీజ్‌ చేశారని చెప్పారు.

ట్రిబ్యునల్‌ బస్సులను విడుదల చేయాలని చెప్పినా రవాణా శాఖ అధికారులు వదలడం లేదన్నారు. సీఎస్‌ లాంటి ఉన్నత స్థాయి అధికారిపైనే వేటు వేసిన ప్రభుత్వం తమనేం చేస్తుందో అన్న భయం వల్లే అధికారులు ముందడుగు వేయలేకపోతున్నారని ఆరోపించారు.

Anantapur District
JC divakarreddy
jagan
travels
  • Loading...

More Telugu News