varavara rao: వరవరరావు బెయిలు పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు

  • భీమా కోరెెగావ్ కేసులో ఆరోపణలు
  • వరవరరావు సహా మరో ఐదుగురి బెయిలు పిటిషన్ కొట్టివేత
  • బెయిలు ఇవ్వొద్దన్న ప్రాసిక్యూషన్

హక్కుల నేత వరవరరావుకు బెయిలు ఇచ్చేందుకు పూణెలోని సెషన్స్ కోర్టు నిరాకరించింది. వరవరరావు సహా మరో ఐదుగురు పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను తిరస్కరించింది. భీమా కోరెగావ్ కేసులో ఆరోపణలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావు, రోనా విల్సన్‌, శోమా సేన్‌, సురేంద్ర గాడ్లింగ్‌, మహేశ్‌ రౌత్‌, సుధీర్‌ ధవ్లే‌లు బెయిులు కోసం పిటిషన్ దాఖలు చేశారు.

వీరందరికీ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు ఆధారాలు చూపించలేకపోయాయని, కాబట్టి వీరందరికీ బెయిలు ఇవ్వాలని వారి తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే, ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు వారి వాదనలను తోసిపుచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు నిందితులు పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను కొట్టివేసింది.  

varavara rao
Bhima Koregaon
Bail
  • Loading...

More Telugu News