spl Tains for kerala: అయ్యప్ప స్వాములకు శుభవార్త.. శబరిమల ప్రయాణానికి ప్రత్యేక రైళ్లు సిద్ధం

  • ఇరవై ప్రత్యేక సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం
  • తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్ల నుంచి కేరళలోని కొల్లాంకు
  • ఈనెల 13 నుంచి జనవరి 13 వరకు అందుబాటులో

అయ్యప్ప స్వాములకు శుభవార్త. శబరిమల వెళ్లే స్వాముల కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్ల నుంచి కేరళ రాష్ట్రం కొల్లాంకు 20 ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. కార్తీక మాసం ప్రారంభంతోనే అయ్యప్ప స్వాముల సందడి మొదలవుతుంది. కేరళ రాష్ట్రంలో పంబానది తీరాన ఉన్న శబరిమలలోని అయ్యప్ప స్వామి దర్శనానికి ముందు నలభై ఒక్కరోజుల (మండలం) దీక్ష చేపట్టి కొండకు మాలధారులు ప్రయాణమవుతారు. నవంబరు మూడో వారం నుంచి సంక్రాంతి రోజున కనిపించే జ్యోతి వరకు స్వాముల ప్రయాణం కొనసాగుతుంది. ఇందుకోసం వేల సంఖ్యలో స్వాములు కేరళకు తరలివెళ్తారు.

దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, కాచిగూడ, మచిలీపట్నం, కాకినాడ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు ఈనెల 13వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

spl Tains for kerala
ayyappa swamulu
south central railway
  • Loading...

More Telugu News