Nirav Modi: నీరవ్ మోదీకి లండన్ కోర్టులో మరోసారి చుక్కెదురు

  • బెయిల్ పిటిషన్ తిరస్కరించిన యూకే కోర్టు
  • పీఎన్ బీని మోసగించిన కేసులో అరెస్టయిన వజ్రాల వ్యాపారి నీరవ్
  • ఐదోసారి బెయిల్ నిరాకరించిన కోర్టు

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూకే కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బీ) ను మోసగించిన కేసులో నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ లండన్ లో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో మార్చి 19న ఆయనను లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు బెయిల్ కావాలంటూ అక్కడి కోర్టును నాలుగుసార్లు అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇటీవల తాజాగా మళ్లీ బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. తాను తీవ్ర మానసిక ఒత్తిడి, నిరాశకు గురవుతున్నానని పిటిషన్లో పేర్కొన్నారు. జైలులో కాకుండా తనను గృహ నిర్బంధంలో ఉంచాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు బెయిల్ ఇవ్వడం సాధ్యంకాదని తెలిపింది.

Nirav Modi
Rejected
PNB Cheating case
UK court
Bail petition
  • Loading...

More Telugu News